HYD: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పెసరికాయల పరీక్షిత్రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఉపఎన్నికల కోసం అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నామినేషన్లు సమర్పిస్తున్నారు.