ADB: రూరల్ మండలంలోని అంకోలి ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి CPR, పలు వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం డిప్యూటీ జిల్లా అధికారి సాధన, డా.సర్ఫరాజ్ ఆధ్వర్యంలో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచించారు.