KDP: కల్తీ మద్యాన్ని అరికట్టేందుకే ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఉందని ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందులలోని స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సురక్ష యాపు ప్రవేశపెట్టిందని, కల్తీ మద్యం తయారీ ప్రభుత్వ విధానానికి పూర్తి వ్యతిరేకమన్నారు.