VZM: కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ లాగా బీసీలకు కుడా అట్రాసిటీ కల్పిస్తూ రిజర్వేషన్ పెంచుతామని ఎన్నికలలో హామీ ఇచ్చారు. కాని ఇప్పటివరకు ఆ ఆలోచన నెరవేర్చలేదని OBC కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా ఛైర్మన్ భోగవిల్లి వెంకట రమణ తెలిపారు. ఈ సందర్బంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన PGRSలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.