ELR: కుక్కునూరు గ్రామ శివారులో సోమవారం ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టి కాలవలోకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యభర్తలు సురక్షితంగా ఉన్నారు. రాజమండ్రి నుంచి చర్ల వెళ్తుండగా ఘటన జరిగింది. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను, కారును బయటకు తీశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.