HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ గ్రేటర్ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కాలనీల్లో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన భవన నిర్మాణ, ఇతర వ్యర్థాలను అధికారులు తొలగిస్తున్నారు.