ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కనకయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. గణితశాస్త్రం-1 ఖాళీ ఉంది.SC,ST అభ్యర్థులకు 50%,ఇతరులకు 55% మార్కులను PGలో కలిగి ఉండాలన్నారు. నెట్,సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులకు ఈనెల 16 చివరి తేది అన్నారు.