NZB: జీల్లాలో బెస్ట్ అవైలబుల్ కింద అభ్యసిస్తున్న విద్యార్థులకు నిధులను వెంటనే విడుదల చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కోసం కార్పొరేట్ పాఠశాలలో ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీం నీరుగారిపోతుందన్నారు.