KMM: సీసీఐ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి పత్తి రైతులను ఆదుకోవాలని అఖిలచభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి నరసయ్య అన్నారు. సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్‌ను సందర్శించి పత్తి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.