MLG: కమలాపురం ఫ్యాక్టరీని టేకోవర్ చేసిన ATC యాజమాన్యం జాడెక్కడని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ ప్రశ్నించారు. ఇవాళ మంగపేటలో ఆయన మాట్లాడుతూ.. 13 ఏళ్ల క్రితం మూతపడిన ఫ్యాక్టరీని ఇప్పటివరకు పునరుద్ధరించలేదని, మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు దీని పై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.