ADB: కాంగ్రెస్ పార్టీకి చేసిన ప్రాథమిక సభ్యత్వ రాజీనామాను వెనక్కు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు భూపెల్లి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను సమావేశమై జిల్లాకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు. భవిష్యత్తులో అండగా ఉంటామని నటరాజన్ భరోసా కల్పించినట్లు శ్రీధర్ పేర్కొన్నారు.