GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం థీమ్-5, క్లీన్, గ్రీన్ విలేజ్ కార్యక్రమంపై మూడు రోజుల శిక్షణా శిబిరం ప్రారంభమైంది. ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గ్రామాల్లో పచ్చదనం పెరిగేలా చెట్లు నాటడం అలాగే ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా, స్వచ్ఛమైన వాతావరణం నెలకొనేలా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, కృషి చేయాలి అని అన్నారు.