ప్రధాని మోదీ స్టార్ కపుల్స్ రామ్ చరణ్-ఉపాసన దంపతులను ప్రశంసించారు. దేశంలోని ప్రాచీన క్రీడ ఆర్చరీకి తిరిగి ప్రాచుర్యం కల్పించేందుకు వారు చేస్తున్న సేవలకు గానూ అభినందించారు. వారితోపాటు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ అనిల్ కామినేని కృషిని కూడా మోదీ ప్రశంసించారు. ఈ మేరకు మోదీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు.