సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా మౌర్య భరద్వాజ్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్కు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.