BDK: లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీ రామచంద్ర ప్రభుత్వ కళాశాల లో సోమవారం AISF నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయం పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై భారం మోపితే ప్రభుత్వంపై ఆందోళన తప్పదని డిమాండ్ చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులపై భారాన్ని తగ్గించాలన్నారు.