SKLM: జీఎస్టీ రేట్ల తగ్గింపుతో సామాన్యులకు ఊరట లభించిందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం ఆమదాలవలస పట్టణంలో ఓ స్థానిక కళ్యాణ మండలంలో జరిగిన జీఎస్టీ 2.0 పై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దీని వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుంది అని, వస్తువులను తక్కువ ధరలకే కొనుక్కుంటున్నారు అని అన్నారు.