ప్రకాశం: ఒంగోలులోని రమ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సోమవారం చోటుచేసుకుంది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని వాపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.