SKLM: జిల్లాకు చెందిన మెగా డీఎస్సీలో ఎంపికైన 528 మంది కొత్త ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారు. ఈ విషయం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. వీరికి ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా పాఠశాలలు కేటాయించి పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేశామన్నారు. వీరు విధుల్లో చేరడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయి అని అన్నారు.