కృష్ణా: తరతరాలుగా దివిసీమ అభివృద్ధికి అంకితమైన కుటుంబం మండలి కుటుంబం అని ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం అవనిగడ్డ వంతెన సెంటరులో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా మోపిదేవి మండలం ఉత్తర చిరువోలులంక గ్రామ కూటమి నాయకులు, నియోజకవర్గ కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.