NTR: ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనకు నూతన కమిటీ మరింత కృషి చేయాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సోమవారం విజయవాడలోని శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి నూతన పాలకవర్గాన్ని ఉమా ఘనంగా సత్కరించారు.