BPT: అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇవాళ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమస్యలను తెలపటానికి కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఎస్పీ స్వయంగా విని, వారు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని సూచించారు.