NZB: భీమ్గల్ మండలం మెండోరాలో సోమవారం సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.