ATP: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరమని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవారం గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో రూ.14 లక్షలు 76,491రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా 23 విడతల్లో 331 మందికి దాదాపుగా రూ.2 కోట్ల 57 లక్షల రూపాయలను సీఎం చంద్రబాబు సహకారంతో లబ్ధిదారులకు అందజేశామని పేర్కొన్నారు.