NDL: RU అనుబంధ కళాశాలల అవినీతి అక్రమాలు అరికట్టాలని DSU జిల్లా కార్యదర్శి వేటూరి రంగ స్వామి డిమాండ్ చేశారు. నంది కోట్కూరు శిరిడి సాయి బాబా, శివ సాయి కృష్ణ బీఈడీ కళాశాల రిజిస్ట్రేషన్ రద్దు చేసి, యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిప్యూటీ తహసీల్దార్ సోమేశ్వరమ్మకు సోమవారం వినతిపత్రం అందజేశారు. NCTE నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.