MBNR: తెలంగాణ తిరుపతిగా పేరొందిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి నవంబర్ 7 వరకు జరగనున్నాయి. ఈ నెల 26న సాయంత్రం 5.30కు స్వామివారి అలంకరణ మహోత్సవం జరగనుంది. ఈ నెల 28న ప్రధాన ఘట్టం ఉద్దాల మహోత్సవం వైభవంగా ప్రారంభం కానుంది. ఉదయం పల్లమర్రి గ్రామం నుంచి చాట బయలుదేరతాయని ఆలయ అధికారులు తెలిపారు.