భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్ క్యాంప్‌బెల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతడు 174 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో బ్యాటర్ షై హోప్ 74 పరుగులతో ఉన్నాడు. ప్రస్తుతం 59 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 195/2 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యాన్ని అధిగమించడానికి విండీస్ ఇంకా 75 పరుగులు వెనుకబడి ఉంది.