BDK: చర్ల సీపీఐ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. భద్రాచలం డివిజన్లో రేసింగ్ కాంట్రాక్టర్లు అతి ఆశతో మితిమీరి ఇసుకను తోడుతూ.. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాధారణ లోడుకు మించి అదనంగా ఓవర్ లోడ్‌తో ఇసుక రవాణా చేయడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని చెప్పారు.