భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ గట్టి పోరాటం చేస్తోంది. లంచ్ విరామం సమయానికి విండీస్ 252/3 రన్స్ చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే కేవలం 18 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. సెంచరీ హీరో క్యాంప్‌బెల్(115)ను జడేజా ఔట్ చేశాడు. ప్రస్తుతం షై హోప్ (92), రోస్టన్ చేజ్ (23) క్రీజులో ఉన్నారు.