MHBD: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, కాలువల వద్ద ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు రావొద్దని సూచించారు.