VZM: రాజాం డిప్యూటీ MPDO శ్రీనివాసరావు సోమవారం స్దానిక సోపేరులో ఇంటింట చెత్త సేకరణ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు బయట చెత్త వెయ్యకుండా చెత్త సేకరణ బండి వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని సూచించారు. చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా చేపట్టాలని, చెత్త ద్వారా సంపదను సృష్టించవచ్చని అన్నారు.