AP: గత ఐదేళ్లలో రాజధాని కోసం అమరావతి ప్రజలు చేసిన ఉద్యమాలు, పడిన కష్టాలను తాను చూశానని CM CBN అన్నారు. వారి ఉద్యమాలు, త్యాగాల ఫలితమే అమరావతి రాజధాని అని తెలిపారు. రాజధాని ‘వేశ్యల ప్రాంతం’ అంటూ కొందరు అక్కసు వ్యక్తంచేసినా అమరావతి ప్రజలు ఐకమత్యంతో నిలబడ్డారన్నారు. ప్రపంచం మొత్తం చూసేలా, హైదరాబాద్‌ని మించిన రాజధాని నిర్మిస్తానని తెలిపారు.