SKLM: నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమల మార్చేశారని వైసీపీ నాయకులు విమర్శించారు. సోమవారం శ్రీకాకుళంలో నకిలీ మద్యంపై వైసీపీ రణభేరి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేత ధర్మాన రామ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని విమర్శించారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు.