ELR: జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. ఈమేరుకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలందరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చారు.