HNK: కాజీపేట (M) సోమిడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. MLG జిల్లా వెంకటాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న జయప్రద అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను HYDలోని యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఆమె మృతి పట్ల ఎంఈవో ప్రభాకర్, సీఆర్పీ కర్ణాకర్, మండల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.