MLG: మేడారం జాతర పనుల సమీక్ష కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి ఇవాళ మేడారానికి రానున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా, పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని, ఆమెకు చెక్ పెట్టేందుకే ఈ పర్యటన అని ప్రచారం జరుగుతోంది. జాతర పనులను పొంగులేటి తన అనుచరులకు కట్టబెడుతున్నారని కొండా ఆరోపణలు వైరల్ అయిన విషయం తెలిసిందే.