ATP: ఉద్యోగున్నతుల కోసం రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పంచాయతీ కార్యదర్శులకు కూటమి ప్రభుత్వం పండుగ తెచ్చిపెట్టిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురంలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.