ADB: కోలాం ఆదివాసీలకు గతంలో మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం భీమ్ ఆర్మీ జిల్లాధ్యక్షుడు షకీల్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో గాడిదకు వినతి పత్రం ఇచ్చినట్లు వివరించారు.