MNCL: బెల్లంపల్లి పట్టణం రైల్వేకాలనీలో బత్తిని నాగరాజు(37) అనే రైల్వే ఉద్యోగి తాగుడుకు బానిసై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు 2 టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అయన వివరాల ప్రకారం నాగరాజు రైల్వేలో డ్రైవర్గా పని చేస్తున్నట్లు, కొద్ది రోజులుగా తాగుడుకు బానిసైనట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.