విశాఖ: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారికి అర్జిత సేవలో భాగంగా సోమవారం సహసనామార్చన విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజు స్వామి వారిని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం క్రతువులు అనంతరం స్వామివారికి తులసీదళాలతో సహస్రనామార్చన విశేషంగా చేపట్టారు.