CTR: రోడ్డు ప్రమాదంలో గంగవరం మండలం పత్తికొండకు చెందిన జూనియర్ లైన్ మెన్ చరణ్ ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారని స్థానికులు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న విద్యుత్ ఉద్యోగుల నిరసన కార్యక్రమానికి ఆయన మినీ బస్ లో బయలుదేరారు. బస్సు బోల్తాపడటంతో మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.