TG: ఈనెల 20 నుంచి వేములవాడ ఆలయ విస్తరణ పనులు జరుగుతాయని, ఈ వారంలో అంతరాలయంలో పనులు జరుగుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ‘దర్శనాల నిలిపివేతలపై ఈనెల 20న ప్రకటిస్తాం. రాజన్న దగ్గర, భీమన్న దగ్గర పరమేశ్వరుడే ఉన్నారు. పనుల సమయంలో భక్తులు ఇబ్బంది పడొద్దు. బండి సంజయ్ సూచనలు తీసుకుంటాం. సమ్మక్క జాతర, మహాశివరాత్రి సమయంలో రాజన్న దర్శనం ఉంటుంది’ అని పేర్కొన్నారు.