NLR: కావలి మండలం, తాళ్లపాలెం గ్రామానికి చెందిన అరగల వెంకమ్మ (60) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. కావలి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.