SKLM: ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా బూర్జ మండలం పెద్ద పేటకి చెందిన ఎ.రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో 8 రాష్ట్రాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో రామకృష్ణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.