ELR: బుట్టాయగూడెం మండలం దేవుడు మాన్యం నివాసాల వద్ద సోమవారం పిడుగుపాటుకు రెండు చూడి ఆవులు మృతి చెందాయి. పశువుల కాపరి దిగమర్తి శ్రీనుకు చెందిన సుమారు లక్ష రూపాయలు విలువ చేసే రెండు ఆవులు పిడుగుపాటుకు మరణించాయని స్థానికులు తెలిపారు. స్థానిక పశుసంవర్ధక, రెవెన్యూ శాఖసిబ్బంది సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలిని పశువుల కాపరి కోరారు.