SKLM: ఎచ్చెర్ల మండలం కొయ్యం సబ్ స్టేషన్ పరిధిలో నిత్యం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుందని సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలు వాపోతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు విద్యుత్‌కి అంతరాయం ఏర్పడడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ శాఖ సిబ్బందికి ఫోన్లో సంప్రదిస్తుంటే సరైన సమాధానం ఇవ్వట్లేదని ప్రజలు తెలిపారు.