PPM: పార్వతీపురం మండలంలోని జమదాల నుంచి లిడికి వలసకు తారు రోడ్డు నిర్మాణం సగంలోనే ఆగింది. సుమారు 2 కి.మీ దూరం రోడ్డు రాళ్లు తేలి రవాణాకు ఇబ్బందిగా మారింది. పదేళ్ల క్రితం రోడ్డు పనులు ప్రారంభించి, జమదాల నుంచి కొత్తపాకలు వరకు వేసి వదిలేశారు. దీంతో జమదాల, బందలుప్పి, గోచెక్క, డోకిశీల, సరిహద్దు ఒడిశా ప్రాంత 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.