కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనను సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.