ప్రకాశం: కంభం పట్టణంలోని చెక్ పోస్ట్ సమీపంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటి నిర్మాణం పై సెంట్రింగ్ పనులు చేస్తూ ఉండగా విద్యుత్ షాక్కు గురై బిల్డింగ్ పై నుండి పడి గుర్రయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకి తరలించారు.