VZM: భార్య మందలించిందని భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్.కోట మండలం తలారి గ్రామంలో చోటుచేసుకొంది. సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సీహెచ్.కృష్ణ మద్యానికి బానిసయ్యాడు. ఈనెల1వ తేదీ రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయనను భార్య మందలించిందని గడ్డి మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కెజీహెచ్లో చనిపోయినట్లు తెలిపారు.