W.G: కార్తీక మాసం సందర్భంగా తణుకు డిపో నుంచి పుణ్య క్షేత్రాలు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సప్పా గిరిధరకుమార్ తెలిపారు. పంచారామాలకు ఈనెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో రాత్రి 7 గంటలకు బస్సులు బయలు దేరి కార్తీక సోమవారం దర్శనాలు అనంతరం తణుకు చేరుతాయని చెప్పారు.